రాజ్యసభ ఉప ఎన్నికలకు తేదీలు ఖరారు

     Written by : smtv Desk | Sun, Jun 16, 2019, 11:29 AM

రాజ్యసభ ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం తేదీలను ప్రకటించింది. ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం రాజ్యసభలోని 6 సీట్లకు జూలై 5న ఎన్నికలు జరగనున్నాయి. ఈ 6 సీట్లు ఒడిషా, బీహార్, గుజరాత్ కి చెందినవే. అలాగే... బీహార్ లో రవిశంకర్ ప్రసాద్ సీటు ఖాళీ అయింది. గుజరాత్ లో అమిత్ షా, స్మృతి ఇరానీ సీట్లు ఖాళీ అయిన విషయం తెలిసిందే.

అదేవిధంగా లోక్ సభ ఎన్నికల్లో రవిశంకర్ ప్రసాద్ పట్నా సాహిబ్ లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించారు. అమిత్ షా గాంధీనగర్ లోక్ సభ సీటు నుంచి, స్మృతి ఇరానీ అమేథీ నుంచి గెలుపొందారు. కాగా రాజ్యసభలో సభ్యుల సంఖ్య 240గా నిర్ధారించబడింది. ఇందులో ఇద్దరిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. 238 మంది సభ్యులను కేంద్ర, రాష్ట్రాల ప్రజా ప్రతినిధుల నుంచి ఎన్నుకోబడతారు.





Untitled Document
Advertisements