ఒత్తిడి లేకుండా ఆడుతాం : కోహ్లీ

     Written by : smtv Desk | Sun, Jun 16, 2019, 01:58 PM

మాంచెస్టర్: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచినా ఓడినా జీవితమేమి అంతం కాదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఓడినా జట్టుకు నష్టమేమి లేదన్నాడు. ఈ మ్యాచ్ కోసం జట్టు సభ్యులు భావోద్వేగానికి గురి కావాల్సిన అవసరం లేదన్నాడు. ప్రపంచకప్ సుదీర్ఘ కాలం సాగే ప్రక్రియా అని ఒక మ్యాచ్‌లో ఓడినంత మాత్రాన జట్టుకు కలిగే ప్రమాదం ఏమీ ఉండదన్నాడు. మిగతా జట్లతో జరిగే మ్యాచ్‌ల లాగానే దీన్ని తాను పరిగణిస్తున్నట్టు కోహ్లి స్పష్టం చేశాడు. ఇతర జట్లతో ఆడినట్టే ఇందులో కూడా ఎలాం టి ఒత్తిడి లేకుండా ఆడతామన్నాడు.

ప్రస్తుతం జట్టు దృష్టంతా ప్రపంచకప్ గెలవడంపైనే కేంద్రీకృతమైందన్నాడు. తమ కు అన్ని మ్యాచ్‌లు చాలా కీలకమన్నాడు. ప్రతి మ్యాచ్‌లో గెలవడమే లక్షంగా పెట్టుకున్నామన్నాడు. ఈ క్రమంలో ఒక టి రెండు మ్యాచుల్లో ఓటమి పాలైనా దా న్ని ఆటలో భాగంగానే చూడాలని సూచించాడు. ఇక, పాక్‌తో జరిగే మ్యాచ్ తమకు చాలా కీలకమన్నాడు. ఇందులో గెలిచి పాక్‌పై ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నాడు. దాయాది మ్యాచ్‌ను పురస్కరించుకుని కోహ్లి మీడియాతో ముచ్చటించాడు.





Untitled Document
Advertisements