నరేశ్ గోయల్‌కు మరో దెబ్బ

     Written by : smtv Desk | Sun, Jun 16, 2019, 02:37 PM

న్యూఢిల్లీ: రుణ సంక్షోభంతో మూతపడిన జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌కు మరో షాక్ తగిలింది. పన్ను ఎగవేత ఆరోపణలు రావడంతో ఆదాయం పన్ను శాఖ ఆయనకు నోటీసులు జారీ చేసింది. విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. రూ.650 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించా ఐటి అధికారులు గోయల్‌ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. గోయల్‌కు ఐటి శాఖ సమన్లు జారీ చేయడం ఇది రెండోసారి. జెట్ ఎయిర్‌వేస్‌లో అవకతవకలు రావడంతో ఐటి శాఖ దర్యాప్తు చేపట్టింది. గత ఏడాది అక్టోబర్‌లో ముంబయిలోని జెట్ ఎయిర్‌వేస్ కార్యాలయంలో అధికారులు సోదాలు జరిపి పలు కీలక డాకుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దర్యాప్తు ఫిబ్రవరిలో ముగియగా.. అందుకు సంబంధించిన నివేదికను అసెస్‌మెంట్ విభాగానికి పంపించారు. జెట్ ఎయిర్‌వేస్‌కు, దుబాయిలోని ఎయిర్‌లైన్ గ్రూపు కంపెనీకి మధ్య అక్రమ లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది. దుబాయిలోని జనరల్ సేల్స్ ఏజంట్‌కు జెట్ ఎయిర్‌వేస్ ఏటా భారీ మొత్తంలో కమిషన్లు ముట్టజెప్పినట్లు దర్యాప్తు నివేదికలో పేర్కొన్నారు. ఆదాయం పన్ను జట్ట పరిమితులకు మించి ఈ చెల్లింపులు జరిగినట్లు తేలింది.‘ జెట్ ఎయిర్‌వేస్ జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించడంలో ఆలస్యం చేస్తున్న సమయంలో ఈ సర్వే జరిగింది.పన్ను ఎగవేత కోసం విదేశాలకు నిధుల మళ్లించాలనే ఉద్దేశంతోనే ఈ చెల్లింపులు జరిగాయి.ఈ చెల్లింపులపై ప్రశ్నించేందుకు గోయల్‌కు సమన్లు జారీ చేశాం’ అని ఆదాయం పన్ను వాఖ అధికారులు చెప్పారు. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు జెట్ ఎయిర్‌వేస్ నిరాకరించింది.





Untitled Document
Advertisements