విద్యుత్ బిల్లుల స్టేటస్‌ తెలుసుకోవాలనుందా

     Written by : smtv Desk | Sun, Jun 16, 2019, 02:44 PM

హైదరాబాద్: నగరం రోజు రోజుకు విస్తరిస్తూ విశ్వనగరంగా రూపుదాల్చుతోంది.ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో కాలనీలు విస్తరిస్తున్నాయి. దాంతో విద్యుత్ కనెక్షన్లు కూడా అధి కం అవుతున్నాయి. కొంత విని యోగదారులు విద్యుత్ కనెక్షన్ల,బిల్లులకు సంబంధించి దళారులను ఆశ్రయిస్తుండటంతో వారు పెద్ద మొత్తంలో వసూలు చేస్తు ఇటు సంస్థకు చెడ్డ పేరు తీసుకు రావడమే కాకుండా వినియోగదారులు కూడా పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టిన విద్యుత్ అధికారులు విద్యుత్ బిల్లులు, విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం జరిగిన విద్యుత్ వినియోదారులకు సంబంధించిన అనేక అనుమానాలను నివృత్తి చేయడమే కాకుండా వారికి అడిగిన ప్రశ్నలకు సమాధానాలను కూడా వివరించారు.

సాధారణంగా వినియోదారులకు విద్యుత్ బిల్లు ఇచ్చిన తేదీ మొదలు నెలాఖరు వరకు సమయం ఉంటుంది.అనంతరం సంబంధిత వినియోగదారుల విద్యుత్ బిల్లుకు సంబంధించి ముందస్తు సమాచారం ఇవ్వడం కాని లేదా విద్యుత్ కనెక్షన్ తొలగించడం జరుగుతుంది. అది కూడా వినియోదారులు పేమెంట్ రికార్డును బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.ముఖ్యంగా విద్యుత్ బిల్లుల స్టేటస్‌ను బిల్లులో ప్రత్యేకంగా తెలియచేస్తున్నారు.బిల్లులో స్టేటస్‌ను 13 విధాలుగా ఏర్పాటు చేశారు. స్టేటస్ 01 నార్మల్ సాధారణ బిల్లుగాను ,02 మీటర్ స్టకప్ అయినట్లుగా, 03 ఉంటే విద్యుత్ కనెక్షన్‌ను తొలగించినట్లుగా,04 ఉంటే మీటర్ మార్పిడిగా, 05 డోర్ లాక్ చేసినట్లుగా, 06 వినియోగంలో లేనట్లుగా, 07 మీటర్ ఓవర్‌ఫ్లో,08 రీడింగ్ పని చేయడం లేదని, 09 ఇల్లు ఖాళీగా చేసినట్లుగా,10 మీటర్లు అధికంగా ఉన్నట్లుగా,11 ఉంటే మీటర్ కాలిపోయినట్లుగా,12 స్లగ్గిష్,99 ఉంటే అవుట్ స్టాడింగ్ లెడ్జర్‌గా గమనించాలన్నారు.

ఈ విధంగా విద్యుత్ బిల్లులో ఉన్న స్టేటస్ ద్వారా మీటర్ స్థితిగతులను తెలుకోవచ్చన్నారు. అంతే కాకుండా బిల్లుకు విద్యుత్ బిల్లకు సంబంధించి ఏవైనా మార్పులు చేర్పులు చేయాలనకుంటే ఆన్‌లైన్ ద్వారా చేసుకోవచ్చని తెలిపారు. అంతే కాకుండా విద్యుత్ మీటర్లకు సంబంధించి ఒకటి కన్నా ఎక్కువ వీటర్లు కావాలంటే ప్యానల్ బోర్డు అనుమతి లేకుండా నాలుగు సింగిల్ ఫేజ్ కనెక్షన్లు ఇవ్వడం, కాని, నాలుగు త్రీ ఫేజ్ కనెక్షన్లు ఇవ్వడం జరగదన్నారు. 5 మీటర్లకు విద్యుత్ కనెక్షన్లు కావాలంటే తప్పని సరిగా ప్యానల్ బోర్డు అనుమతి తీసుకోవాలన్నారు.విద్యుత్ మీటర్లు, కనెక్షన్లకు సంబంధించి ఎటువంటి సమాచారం తెలుసుకోవాలన్నా సమీప విద్యుత్ కార్యాలయానికి కాని లేదా విద్యుత్ శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించడం కాని చేయాలన్నారు.





Untitled Document
Advertisements