అభిమానుల ప్ర‌శ్న‌ల‌కు స‌మంత స‌మాధానం

     Written by : smtv Desk | Sun, Jun 16, 2019, 03:05 PM

అభిమానుల ప్ర‌శ్న‌ల‌కు స‌మంత స‌మాధానం

సినిమాలో అద్భుత న‌ట‌న‌తో త‌న పాత్ర‌ను పండించ‌డంలోనే కాదు.. సినిమాను ప్రేక్ష‌కుల‌కు చేరువ చేయ‌డంలోనూ టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత‌ది ప్ర‌త్యేక శైలి. స‌మంత న‌టించిన తాజా చిత్రం 'ఓ బేబీ'. ఓ కొరియా సినిమా ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమాను నందినీ రెడ్డి తెర‌కెక్కించింది. జూలై ఐదో తేదీన ఈ సినిమా విడుద‌ల కాబోతోంది.

ఈ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగానే స‌మంత త‌న ట్విట‌ర్ హ్యాండిల్ పేరును 'బేబీ అక్కినేని' గా మార్చుకుంది. మ‌రికొద్ది గంట‌ల్లో ట్విట‌ర్ ద్వారా అభిమానుల‌తో ముచ్చ‌టించ‌నుంది. ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ రాజీవ్ మ‌సంద్‌తో క‌లిసి స‌మంత ట్విట‌ర్ చాట్‌లో పాల్గొనబోతోంది. రాజీవ్ ప్ర‌శ్న‌ల‌తోపాటు అభిమానుల ప్ర‌శ్న‌ల‌కు కూడా స‌మంత స‌మాధానాలు చెప్ప‌బోతోంది. ఈ విష‌యాన్ని ట్విట‌ర్ ద్వారా స‌మంత తెలియ‌జేసింది.





Untitled Document
Advertisements