80 మందికి పైగా పిల్లలు మృత్యువాత

     Written by : smtv Desk | Sun, Jun 16, 2019, 05:18 PM

80 మందికి పైగా పిల్లలు మృత్యువాత

బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో హైపోగ్లెమియా వ్యాధితో మృత్యువాత పడుతున్న చిన్నారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 80కి చేరినట్టు శ్రీకృష్ణ వైద్య కళాశాల ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీల్ కుమార్ షాహి ఆదివారంనాడు తెలిపారు. మరణించిన వారంతా పదేళ్లలోపు వయస్సుగల వారేనని అధికారులు చెబుతున్నారు.

శ్రీకృష్ణ వైద్య కళాశాల ఆసుపత్రి, కేజ్రీవాల్ ఆసుపత్రిలో ఈ చిన్నారులు వైద్య చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. శ్రీకృష్ణ వైద్య ఆసుపత్రిలో 197 మంది, ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న కేజ్రీవాల్ ఆసుపత్రిలో 91 మంది చిన్నారులు చేరినట్టు చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మందికి హైపో గ్లైసిమియా ఉన్నట్టు పరీక్షలో తెలిసింది. రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోవడంతో పిల్లలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు.





Untitled Document
Advertisements