మాస్టర్ బ్లాస్టర్ రికార్డు బద్దలుకొట్టిన కోహ్లీ

     Written by : smtv Desk | Sun, Jun 16, 2019, 07:12 PM

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును భారత ప్లేయర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. విరాట్ కోహ్లీకి ఈ రికార్డు ఎప్పటి నుంచో ఊరిస్తోంది. వన్డేలో 11 వేల పరుగులకు 57 పరుగుల దూరంలో కోహ్లీ ఉన్నాడు. ఈరోజు ఆ పరుగులు చేయగా కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. వన్డేల్లో వేగంగా 11 వేల పరుగులు చేసిన బ్యాట్స్ మన్ గా కోహ్లీ చరిత్రపుటల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. పాకిస్థాన్ తో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో 57 పరుగులు సాధించిన అనంతరం కోహ్లీ వన్డేల్లో 11,000 మైలురాయిని అందుకున్నాడు. 11 వేల పరుగులను కోహ్లీ 222 ఇన్నింగ్స్ ల్లో రాబట్టాడు. సచిన్ ఈ ఫీట్ సాధించేందుకు 276 ఇన్నింగ్స్ లు ఆడాడు. 11 వేల పరుగులు చేసిన ఆటగాళ్లలో విరాట్ కంటే తొమ్మిది మంది ముందన్నారు. అతి తక్కువ మ్యాచ్ లో 10 వేల పరుగులు చేసిన ఘనత మాత్రం కోహ్లీకే దక్కింది.





Untitled Document
Advertisements