డ్వాక్రా మహిళలకు తీపికబురు

     Written by : smtv Desk | Sun, Jun 16, 2019, 07:59 PM

ఏపీ సీఎం జగన్ పాలనలో తన మార్క్ చూపిస్తూ ముందుకు సాగుతోన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వెళ్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీపికబురు అందించింది. ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకాల్లో భాగంగా ‘వైఎస్ఆర్ ఆసరా’ ద్వారా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయనున్నారు. 2019 ఏప్రిల్ 11వ తేదీకి ముందు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం రూ.840 కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేయనున్నారని సమాచారం. ఈ రుణమాఫీ నాలుగు విడుతల్లో చేయనున్నారు. అయితే ఇందులో ఒక లొసుగు ఉంది, రుణం పొందిన మహిళలు తమ బకాయిని కడుతూనే ఉండాలి. ఆ తర్వాత రోజుల్లో మాఫీ అయిన నగదు మొత్తం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వమే జమ చేస్తుంది. ముందు అధికారులు బ్యాంకుల ద్వారా అర్హులైనా లబ్ధిదారులను ముందుగా గుర్తిస్తారు. అలా గుర్తించిన వారి సమాచారాన్ని సెర్ఫ్‌కు అందిస్తారు. అనంతరం 2019, ఏప్రిల్‌ 11 నాటికి అప్పు తీసుకున్న డ్వాక్రా సభ్యులకు ఆ మొత్తాన్ని బ్యాంకులో నాలుగు విడతల్లో జమచేస్తారు.





Untitled Document
Advertisements