గంగూలీ రికార్డు బ్రేక్ చేయబోతున్న కింగ్ కోహ్లీ

     Written by : smtv Desk | Mon, Jun 17, 2019, 11:12 AM

మాంచెస్టర్: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 పరుగులు చేయడంతో 11 వేల పరుగులు చేసిన తొమ్మిదో ఆటగాడిగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా అత్యంత వేగంగా ఈ రికార్డును చేరుకున్న తొలి బ్యాట్స్‌మన్‌గా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ 276 ఇన్నింగ్స్‌లలో 11 వేల పరుగులు మార్క్‌ను చేరుకోగా ఇప్పుడు కోహ్లీ కేవలం 222 ఇన్నింగ్స్‌లలోనే ఈ రికార్డుకు చేరడం విశేషం. అంతేకాకుండా క్రికెట్‌లోకి వచ్చిన 11 ఏళ్ల లోపే ఈ ఘనతను సొంతం చేసుకున్న ఆటగాడిగానూ కోహ్లీ రికార్డుల్లో నిలిచాడు. ఇక భారత్ తరఫున తెండూల్కర్, గంగూలి మాత్రమే ఈ ఫీట్ నమోదు చేశారు. ఈ జాబితాలో గంగూలీని అధిగమించి ఎనిమిదో ఆటగాడిగా కోహ్లీ ఈ ప్రపంచకప్‌లోనే నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గంగూలీ11,363 పరుగులు చేశాడు. మంచి ఫామ్‌లో ఉన్న కోహ్లీకి దీన్ని అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇంతకు ముందు అంతర్జాతీయ క్రికెట్‌లో 11 వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌లో తెండూల్కర్ (276 ఇన్నింగ్స్), రికీ పాంటింగ్ (286), సౌరబ్ గంగూలీ (288),కలిస్(293),సంగక్కర (318),ఇంజమాముల్ హక్(324), సనత్ జయసూర్య (354), జయవర్ధనె(368) మాత్రమే ఉన్నారు.





Untitled Document
Advertisements