విండీస్‌‌ వీరులు కాస్త ఓపిగ్గా ఆడితే

     Written by : smtv Desk | Mon, Jun 17, 2019, 11:32 AM

టాంటన్‌‌: వరల్డ్‌‌కప్‌‌లో బంగ్లాదేశ్‌‌, వెస్టిండీస్‌‌ కీలక మ్యాచ్‌‌కు సిద్ధమయ్యాయి. సెమీస్‌‌ అవకాశాలు సజీవంగా నిలుపుకోవాలని భావిస్తున్న ఇరు జట్లు సోమవారం జరిగే పోరులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. టాంటన్‌‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌‌ ఇరు జట్లకు కీలకం కానుంది. ఇప్పటికే తలో నాలుగు మ్యాచ్‌‌లాడిన బంగ్లా, విండీస్‌‌ మూడు పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ఈ రెండు జట్లు చెరో రెండు మ్యాచ్‌‌ల్లో ఓడిపోగా, ఓ మ్యాచ్‌‌ వర్షం కారణంగా రద్దు అయింది. ప్రస్తుతం రేస్‌‌లో సమానంగా నిలిచిన రెండు టీమ్‌‌ల్లో బంగ్లాదే కాస్త పైచేయిలా కనిపిస్తుంది. వరల్డ్‌‌కప్‌‌ ప్రారంభానికి ముందు ఐర్లండ్‌‌లో జరిగిన ట్రై సిరీస్‌‌లో విండీస్‌‌ను బంగ్లా మూడు మ్యాచ్‌‌ల్లో ఓడించింది. అయితే అప్పటి విండీస్‌‌ టీమ్‌‌లో గేల్‌‌, రసెల్‌‌ లేరు. వీరి చేరికతో ప్రస్తుతం బలంగా కనిపిస్తున్న కరీబియన్‌‌ జట్టుకూ విజయావకాశాలు అధికంగానే ఉన్నాయి. ఈ నెల ఎనిమిదో తేదీన ఇంగ్లండ్‌‌తో ఆడిన బంగ్లా వారం తర్వాత సోమవారం బరిలోకి దిగుతుంది. మధ్యలో శ్రీలంకతో ఆడాల్సిన మ్యాచ్‌‌ వర్షం వల్ల రద్దు అయ్యింది. బ్యాటింగ్‌‌ విభాగం బలంగానే ఉన్న బంగ్లా బౌలింగే కలవరపెడుతుంది. బౌలర్లు పరుగులు ధారాళంగా ఇచ్చేస్తున్నారు. మరో పక్క విండీస్‌‌ జట్టు అన్ని విభాగాల్లో బలంగానే కనిపిస్తున్న సమష్ఠిగా రాణించడంలో విఫలమవుతోంది. ముఖ్యంగా జట్టులోని ప్రధాన బ్యాట్స్‌‌మెన్‌‌ అందరూ టీ20లకు అలవాటు పడిపోవడం విండీస్‌‌కు ఇబ్బందిగా మారింది. విండీస్‌‌ వీరులు కాస్త ఓపిగ్గా ఆడితే బంగ్లాకు పీడకల తప్పకపోవచ్చు





Untitled Document
Advertisements