పాక్ బౌలర్ అమిర్‌కు రెండుసార్లు హెచ్చరికలు!

     Written by : smtv Desk | Mon, Jun 17, 2019, 12:26 PM

పాక్ బౌలర్ అమిర్‌కు రెండుసార్లు హెచ్చరికలు!

పాకిస్తాన్-భారత్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్‌ స్టార్ పేసర్ మహ్మద్‌ అమిర్‌ను ఫీల్డ్ అంపైర్‌ రెండు సార్లు హెచ్చరించాడు. భారత ఇన్నింగ్స్ కొనసాగుతుండగా.. మూడో ఓవర్‌ మూడో బంతి వేసిన అనంతరం అమిర్‌ పిచ్‌పై పరిగెత్తాడు. దీంతో ఫీల్డ్ అంపైర్‌ బ్రూస్‌ ఆక్పెన్‌ఫర్డ్‌.. అమిర్‌కు తొలి వార్నింగ్‌ ఇచ్చాడు.వెంటనే పాకిస్థాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్ అంపైర్‌ వద్దకు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయాడు. ఇక అంపైర్‌ వార్నింగ్‌ను ఏమాత్రం పట్టించుకోని అమిర్‌.. ఐదో ఓవర్లో మరోసారీ పిచ్‌పై పరిగెత్తాడు. దాంతో ఆగ్రహించిన ఆక్సెన్‌ఫర్డ్‌.. అమిర్‌ను రెండోసారి హెచ్చరించాడు. అయితే అంపైర్‌ హెచ్చరించినా కూడా ఆమిర్‌.. నవ్వు తూ కనిపించాడు.మూడోసారి కూడా అమిర్‌కు అంపైర్‌ వార్నింగ్‌ ఇచ్చివుంటే.. ఈ మ్యాచ్ ఇన్నింగ్స్‌లో మళ్లీ బౌలింగ్‌ చేసేందుకు అతనికి అవకాశం ఉండకపోయేది. అమిర్‌ అనంతరం మరో పేస్ బౌలర్ వాహబ్‌ రియాజ్‌ రెండు సార్లు వార్నింగ్‌కు గురయ్యాడు. ఇన్నింగ్స్ 24వ ఓవర్‌లో వాహబ్‌ రియాజ్‌ను రెండు సార్లు అంపైర్లు హెచ్చరించారు. ఈ మ్యాచ్‌లో అమిర్‌ మూడు కీలక వికెట్లు తీసాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, ఎంఎస్ ధోనీలను పెవిలియన్ చేర్చాడు. తన కోటా 10 ఓవర్లలో 47 పరుగులు ఇచ్చాడు.





Untitled Document
Advertisements