భారీగా కరిగిన గ్రీన్‌ల్యాండ్ మంచు

     Written by : smtv Desk | Mon, Jun 17, 2019, 12:30 PM

భారీగా కరిగిన గ్రీన్‌ల్యాండ్ మంచు

న్యూయార్క్: గ్రీన్‌ల్యాండ్ కు చెందిన మంచుగడ్డలు ఈ ఏడాది దాదాపు రెండు బిలియన్ టన్నులు కన్నా ఎక్కువగా కరిగిపోయాయి. ఇది ఈ వారం ఒక్క రోజు లోనే జరగడం విశేషం.జూన్ 13న పరిశోధకులు లెక్క చూస్తే దాదాపు 2 గిగా టన్నుల కన్నా ఎక్కువగానే కరిగినట్టు తేలింది. ఆర్కిటిక్, ఉత్తర అట్లాంటిక్ వాతావరణంలో మార్పు వల్ల ఇది సాధారణం కన్నా అసాధారణంగా ముందే జరిగిందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విధంగా అకస్మాత్తుగా కరగడం జరగడం ఏడేళ్ల క్రితం కూడా సంభవించింది. మంచుగడ్డలు కరిగే సీజన్ గ్రీన్‌ల్యాండ్‌లో సాధారణంగా మే26న ప్రారంభమవుతుంది. కానీ ఈ ఏడాది ఏప్రిల్ 30న ప్రారంభం అయింది.





Untitled Document
Advertisements