హాంగ్‌కాంగ్ ప్రభుత్వ ప్రతినిధి క్యారీలామ్ రాజీనామాకు డిమాండ్స్

     Written by : smtv Desk | Mon, Jun 17, 2019, 12:34 PM

హాంగ్‌కాంగ్ ప్రభుత్వ ప్రతినిధి క్యారీలామ్ రాజీనామాకు డిమాండ్స్

హాంకాంగ్: హాంగ్‌కాంగ్‌లో ఆదివారం భారీ ఎత్తున నిరసన కారులు ప్రదర్శన నిర్వహించారు. చైనాకు నేరస్థులను అప్పగించే అప్పగింత బిల్లు ప్రతిపాదనను హాంకాంగ్ ప్రభుత్వం ఉపసంహరిస్తామని ప్రకటించినప్పటికీ నిరసనలు ఆగలేదు. చైనాకు అనుకూల నేత, హాంగ్‌కాంగ్ ప్రభుత్వ ప్రతినిధి క్యారీలామ్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత వారం లాగే ఈ ఆదివారం కూడా వీధుల్లో ఆందోళన కారులు చొచ్చుకుపపోయారు. పార్లమెంటు వరకు ఈ నిరసన ప్రదర్శన కొన్ని మైళ్ల పొడవునా సాగింది. మిలియన్ మంది ఇందులో పాల్గొన్నారు. వాణిజ్యానికి సురక్షితమైన నగరంగా ప్రసిద్ధి చెందిన నగరానికి ఈ బిల్లు ప్రతిపాదన వల్ల ప్రతిష్ట పోయిందని చాలామంది విమర్శించారు. సంఘర్షణలకు, వివాదాలకు దారి తీసే ఈ బిల్లు విషయంలో ఏ విధంగా వ్యవహరించాలో యోచిస్తున్నట్టు లామ్స్ ఆఫీస్ ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో ఒప్పుకుంది. ఆదివారం ఆందోళన కారులు లామ్ రాజీనామాయే కాకుండా పోలీసుల దౌర్జన్యానికి క్షమాపణ చెప్పాలని, శాశ్వతంగా బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.





Untitled Document
Advertisements