పానాసోనిక్ సబ్ బ్రాండ్ సాన్యో బడ్జెట్ స్మార్ట్‌టీవీలు

     Written by : smtv Desk | Mon, Jun 17, 2019, 12:46 PM

పానాసోనిక్ సబ్ బ్రాండ్ సాన్యో బడ్జెట్ స్మార్ట్‌టీవీలు

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ పానాసోనిక్ సబ్ బ్రాండ్ సాన్యో తాజాగా రెండు కొత్త స్మార్ట్‌టీవీలను లాంచ్ చేసింది. వీటిల్లో అందుబాటు ధరకే అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. సాన్యో కొత్త స్మార్ట్ టీవీల్లో ఒకటి 32 అంగుళాల టీవీ. మరొకటి 43 అంగుళాల టీవీ. ఈ టీవీలు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో అందుబాటులో ఉంటాయి. సాన్యో 32 అంగుళాల హెచ్‌డీ టీవీ ధర రూ.12,999. ఇక 43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ టీవీ ధర రూ.22,999. రెండు టీవీల్లోనూ నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ఐపీఎస్ టెక్నాలజీ డిస్‌ప్లే, సూపీరియర్ స్పీకర్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.





Untitled Document
Advertisements