అత్యంత చెత్త బౌలింగ్‌: రషీద్ 9 ఓవర్లలో ఏకంగా 110 పరుగులు

     Written by : smtv Desk | Wed, Jun 19, 2019, 08:01 AM

ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. పసికూన అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇయాన్ మోర్గాన్ (148) విధ్వంసక సెంచరీతో కదం తొక్కడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 8 వికెట్లకు 247 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయం చవిచూసింది.

మోర్గాన్ వీర విహారంతో అఫ్గాన్ సంచలన బౌలర్ రషీద్ ఖాన్ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. రషీద్ 9 ఓవర్లలో ఏకంగా 110 పరుగులు ఇచ్చుకున్నాడు. 12.22 ఎకానమీతో రషీద్ ఈ పరుగులు సమర్పించుకున్నాడు. వన్డే క్రికెట్‌లో ఇది అత్యంత చెత్త బౌలింగ్‌గా రికార్డులకు ఎక్కింది.





Untitled Document
Advertisements