రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ

     Written by : smtv Desk | Wed, Jun 19, 2019, 11:32 AM

రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ

నేడు బర్త్ డే జరుపుకుంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రాహుల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని.. ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. ఇక తమ అధ్యక్షుడి బర్త్ డేను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఓ వీడియోను పోస్టు చేసింది. ప్రజల్లో రాహుల్ స్ఫూర్తి నింపిన ఐదు ఘటనలంటూ ఈ వీడియోను పోస్టు చేసింది. మరోవైపు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, వివిధ పార్టీల నేతలు రాహుల్‌కు శుభాకాంక్షలు చెబుతూ ట్విట్టర్‌ను హోరెత్తిస్తున్నారు.





Untitled Document
Advertisements