పాక్ మీడియా ఎప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించడం నేర్చుకుంటుందో: షోయబ్ మాలిక్

     Written by : smtv Desk | Wed, Jun 19, 2019, 11:37 AM

పాక్ మీడియా ఎప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించడం నేర్చుకుంటుందో: షోయబ్ మాలిక్

పాకిస్తాన్ క్రికెట్ జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ పాక్ మీడియాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం భారత్ తో జరిగిన మ్యాచ్ పాక్ పేలవ ప్రదర్శనతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమిపై పాక్ మీడియా అనేక కథనాలు రాసింది. వీటిపై తాజాగా షోయబ్ మాలిక్ స్పందిస్తూ ‘అంతర్జాతీయ క్రికెట్‌లో దాదాపు 20 ఏళ్లకిపైగా పాకిస్థాన్ టీమ్‌కు సేవలు అందించాను. అయినప్పటికీ.. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై వివరణ ఇవ్వాల్సి రావడం చాలా బాధగా ఉంది. ఆ వీడియోలు జూన్ 13న (గురువారం) తీసినవి.. జూన్ 15న (శనివారం) కాదు. పాకిస్థాన్ మీడియా ఎప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించడం నేర్చుకుంటుందో..?’ అని పెదవి విరిచాడు. భారత్‌పై మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే షోయబ్ మాలిక్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements