మహిళల టి20 అత్యంత చెత్త రికార్డు......6కే ఆలౌట్

     Written by : smtv Desk | Wed, Jun 19, 2019, 11:39 AM

మహిళల టి20 అత్యంత చెత్త రికార్డు......6కే ఆలౌట్

మహిళల అంతర్జాతీయ టి20లో ఓ చెత్త రికార్డు నెలకొంది. క్విబుక మహిళల టి20 టోర్నీలో రువాండ-మాలి జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్ లో ఈ కొత్త చెత్త రికార్డును మాలి జట్టు తమ పేర లిఖించుకుంది. ఈ మ్యాచ్ లో మాలి మహిళల జట్టు 9 ఓవర్లలో 6 పరుగులు చేసి ఆలౌటైంది. మరో ఆసక్తికర విషయమేంటంటే ఓపెనర్‌ సమకె (1) చేసిన పరుగే టాప్‌ స్కోర్‌! ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పది మంది 'జీరో'లే! ఒక్కరు మినహా అందరు 6, 7 బంతులాడి ఖాతా తెరవకుండానే ఔటైతే... కౌలిబెలీ మాత్రం అత్యధికంగా 12 బంతులాడి డకౌటైంది. ఇక మిగతా 5 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. 2 బైస్, మరో 2 లెగ్‌బైస్, ఒకటేమో వైడ్‌... ఇది మాలి ఇన్నింగ్స్‌ కథకమామిషు! ఈ చెత్త రికార్డును ఛేదించేందుకు బరిలోకి దిగిన రువాండ జట్టు 4 బంతులాడి 8 పరుగులు చేసి గెలిచింది. ఇదే ఏడాది జనవరిలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో చైనా నెలకొల్పిన చెత్త రికార్డు (14 ఆలౌట్‌)ను మాలి సవరించింది.





Untitled Document
Advertisements