బుధవారం కూడా పైకే!

     Written by : smtv Desk | Wed, Jun 19, 2019, 11:40 AM

బుధవారం కూడా పైకే!

దేశీ మార్కెట్లో బుధవారం బంగారం పది గ్రాముల బంగారం ధర రూ.100 పెరుగుదలతో రూ.33,720కు చేరింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నప్పటికీ దేశీయంగా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడం సానుకూల ప్రభావం చూపింది. అయితే ఇదే బాటలో వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర స్వల్పంగా రూ.130 పెరుగుదలతో రూ.38,220కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ పెరగడం ఇందుకు కారణం. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరుగుదలతో రూ.33,720కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరుగుదలతో రూ.33,550కు క్షీణించింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.26,800 వద్ద కొనసాగింది. కేజీ వెండి ధర రూ.130 పెరుగుదలతో రూ.38,220కు చేరితే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.140 పెరుగుదలతో రూ.37,256కు ఎగసింది. ఇకపోతే హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.33,020కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.31,450కు పెరిగింది. కేజీ వెండి ధర రూ.40,100కు చేరింది.





Untitled Document
Advertisements