కరెన్సీ రంగంలోకి ఫేస్‌బుక్!

     Written by : smtv Desk | Wed, Jun 19, 2019, 11:42 AM

కరెన్సీ రంగంలోకి ఫేస్‌బుక్!

శాన్‌ఫ్రాన్సిస్కో: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో ఫేస్‌బుక్ కరెన్సీ రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు లిబ్రా పేరుతో సొంత క్రిప్టో కరెన్సీని విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఫేస్‌బుక్ ఇకామర్స్, గ్లోబల్ పేమెంట్స్ రంగంలోకి అడుగుపెట్టడానికి వీలుగా వేసిన తొలి అడుగుగా దీన్ని భావిస్తున్నారు. ఫేస్‌బుక్ జెనీవాకు సంబంధించిన లిబ్రా అనే సంస్థతో 28 మంది భాగస్వాములను అనుసంధానించి దీన్ని తయారు చేశారు. 2020 నాటికి ఈ సంస్థ ఈ డిజిటల్ కాయిన్‌ను చలామణిలోకి తెచ్చేందుకు వీలుగా ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇప్పటికే ఫేస్‌బుక్ ‘కలిబ్రా’ అనే మరో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ డిజిటల్ వాలెట్ సేవలను అందిస్తుంది. ముఖ్యంగా లిబ్రాలను వినియోగించే వీలుగా దీన్ని రూపొందించారు. కాగా కలిబ్రా వాలెట్‌ను ఫేస్‌బుక్ మెసెంజర్‌కు, వాట్సాప్‌కు అనుసంధానించనున్నారు. ఇప్పటికే ఆర్థిక సేవలు పొందుతున్న వారే కాకుండా కొత్తవారికి ఈ సేవలను దగ్గర చేయాలన్నదే ఫేస్‌బుక్ లక్షం.రోమన్లు తూకానికి వాడే కొలతలనుంచి స్ఫూర్తిపొంది దీనికి లిబ్రా అని పేరు పెట్టారు. అంతేకాదు, ఖగోళ శాస్తరం ప్రకారం న్యాయానికి కూడా ఇది చిహ్నమని, అందుకే ఈ పేరును ఎంచుకున్నట్లు పేపాల్ మాజీ ఎగ్జిక్యూటివ్, ఈ ప్రాజెక్ట్ హెడ్ డేవిడ్ మార్గోస్ తెలిపారు.‘ స్వేచ్ఛ, న్యాయం, డబ్బు.. ఇవే మేము చేయాలనుకున్నవి’ అని చెప్పారు. అయితే ఇప్పటివరకు సరైన విధానం లేని క్రిప్టో కరెన్సీ రంగంలోకి ఫేస్‌బుక్ రావడంతో న్యాయపరమౌన సమస్యలు తప్పకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కాగా, ఈ ప్రాజెక్టులో మాస్టర్ కార్డు, వీసా,స్పాటిఫై, పేపాల్,ఈబే, ఉబర్ టెక్నాలజీ,వొడాఫోన్‌లాంటి దిగ్గజసంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి.2020 నాటికి లిబ్రాను మార్కెట్లోకి విడుదల చేసే నాటికి కనీసం వందమంది భాగస్వాములనైనా చేర్చుకోవాలని ఫేస్‌బుక్ భావిస్తోంది. ఒక్కొక్కరు కనీసం పది మిలియన్ డాలర్లు పెట్టుబడులను తీసుకురావాలి.అయితే 2019 తర్వాత ఫేస్‌బుక్ ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహించే అవకాశం లేదు. కాగా కలిబ్రా వాలెట్‌ను ఉపయోగించాలంటే వారి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తారు. కీలకమైన ఖాతాలకు సంబంధించిన సమాచారం మాత్రమే కలిబ్రా భాగస్వాములుకు గాని,ఫేస్‌బుక్‌కు కాని వెళుతుంది.చట్ట నిబంధనల ప్రకారం భద్రత కోసమే ఇలా చేస్తారు.అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్ కరెన్సీని ఆపరేట్ చేయడానికి లిబ్రా సంక్లిష్టమైన బ్లాక్‌చైన్ టెక్నాలజీతో కూడిన ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడుతుంది.





Untitled Document
Advertisements