తిరుమల ఘాట్‌లో రాత్రి వేళ బైక్‌లపై ప్రయాణం రద్దు

     Written by : smtv Desk | Wed, Jun 19, 2019, 11:46 AM

తిరుమల ఘాట్‌లో రాత్రి వేళ బైక్‌లపై ప్రయాణం రద్దు

తిరుమల ఘాట్‌ రోడ్డులో ఇకపై సాయంత్రం ఆరు గంటల నుంచి మరునాడు ఉదయం 6 గంటల వరకు (రాత్రంతా) ద్విచక్ర వాహనాల రాకపోకలకు అనుమతించ కూడదని అధికారులునిర్ణయించారు. ఈ ఘాట్‌ రోడ్డులో రెండు రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పలువురు భక్తులపై చిరుత పులి దాడిచేసి గాయపర్చిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సీవోఎస్‌ఓ, అర్బన్‌ ఎస్పీ, అటవీ శాఖాధికారులు సమావేశమై భక్తుల భద్రత అంశంపై చర్చించారు. ఘాట్‌ రోడ్డులో పులి సంచరిస్తున్న సీసీ టీవీ పుటేజీని పరిశీలించారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నందున రాత్రిపూట ద్విచక్ర వాహన చోదకులు ఎవరూ ఘాట్‌లో ప్రయాణించేందుకు రావద్దని సూచించారు. అలాగే క్రూరమృగాలు సంచరించే ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు.





Untitled Document
Advertisements