గాల్లో విమానం షేక్...గుప్పిట్లో ప్రయాణీకుల ప్రాణాలు....వైరల్ వీడియో

     Written by : smtv Desk | Wed, Jun 19, 2019, 05:44 PM

గాల్లో విమానం షేక్...గుప్పిట్లో ప్రయాణీకుల ప్రాణాలు....వైరల్ వీడియో

స్విట్జర్లాండ్‌లోని బెసెల్‌కు వెళ్తున్న విమానంలో ఓ సంఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా ఒక్కసారిగా షేక్ అవ్వడంతో ప్రయాణీకులందరూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నారు. కొసోవోలోని ప్రిస్టినా నుంచి స్విట్జర్లాండ్‌లోని బెసెల్‌కు వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.విమానం గాల్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా షేక్ అయ్యింది. దీంతో ఆ సమయంలో ప్రయాణికులకు అందించేందుకు తీసుకెళ్తున్న డ్రింక్స్ కార్ట్ ఎగిరి, విమానం సీలింగ్ కు తగిలి, ప్రయాణికులందరిపై పడింది. ఆ కార్ట్‌లో ఉన్న వేడి వేడి టీ, కాఫీలు, వాటర్ ప్రయాణికులపై పడ్డాయి. దీంతో వారందరికీ శరీరంపై గాయాలయ్యాయి. ఈ ఘటనలో దాదాపు 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.దీంతో పైలట్ వెంటనే బెసెల్ ఎయిర్ పోర్టు అధికారులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే వారందరినీ ఆస్పత్రికి తరలించారు. ఇదంతా విమానం ల్యాండింగ్‌కు 20 నిమిషాల ముందు జరిగింది.

Untitled Document
Advertisements