రషీద్‌ఖాన్‌పై ఐస్‌లాండ్‌ క్రికెట్‌ వ్యంగ్య వ్యాఖ్యలు

     Written by : smtv Desk | Wed, Jun 19, 2019, 07:00 PM

రషీద్‌ఖాన్‌పై ఐస్‌లాండ్‌ క్రికెట్‌ వ్యంగ్య వ్యాఖ్యలు

ఐస్‌లాండ్‌ క్రికెట్‌ తన ట్విటర్‌ అకౌంట్‌లో ఆఫ్గనిస్తాన్‌ బౌలర్‌ రషీద్‌ఖాన్‌పై వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం ఆఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్‌ఖాన్‌ మొత్తం 9ఓవర్ల స్పెల్‌లో 110 పరుగులు సమర్పించుకొని ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా రషీద్‌ఖాన్‌ రికార్డులకెక్కాడు. అయితే ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత ఐస్‌లాండ్‌ క్రికెట్‌ తన ట్విటర్‌ అకౌంట్‌లో లెగ్‌స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ను ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యలు చేసింది . 'మాకు ఇప్పుడే తెలిసింది. కేవలం 57బంతుల్లోనే 110 పరుగులు చేసిన రషీద్‌ ఆఫ్గనిస్తాన్‌ బౌలర్‌గా ఈ ఘనతను సాధించడం ఆనందంగా ఉంది. అద్భుతంగా బ్యాటింగ్‌ చేశావు యంగ్‌మ్యాన్‌' అంటూ ట్వీట్‌ చేసింది. దీనిపై క్రికెటర్‌ ల్యూక్‌రైట్‌ స్పందిస్తూ 'ఐస్‌లాండ్‌ క్రికెట్‌ చేసిన ట్వీట్‌ చాలా చెత్తగా ఉంది. అసోసియేట్‌ దేశం తరపున ఆడుతున్న రషీద్‌ఖాన్‌ను ఒక క్రికెటర్‌గా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది' అని ట్విటర్‌లో తెలిపారు. ల్యూక్‌ రైట్‌ చేసిన ట్వీట్‌కు మాజీ ఆస్ట్రేలియన్‌ బౌలర్‌ జాసన్‌ గిలెస్పీ, ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ తమ మద్దతు తెలిపారు.

Untitled Document
Advertisements