జుమ్మేరాత్ బజార్ లో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే రాజాసింగ్‌ తలకు తీవ్ర గాయం

     Written by : smtv Desk | Thu, Jun 20, 2019, 09:54 AM

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జుమ్మేరాత్ బజార్ లో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. జుమ్మెరాత్ బజార్‌లో స్థానికులంతా కలిసి స్వాతంత్ర్య సమరయోధురాలు రాణి అవంతిభాయ్‌ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రయత్నించిన వేళ, మరో వర్గం వారు దాన్ని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చేసరికే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన మద్దతుదారులతో చేరుకుని, స్థానికులతో కలిసి నిరసనకు దిగారు. మరో వర్గం స్థానికులు వీరిపై రాళ్లురువ్వారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ చేయగా పోలీసుల దాడిలో రాజాసింగ్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దేశం కోసం పోరాడిన యోధురాలి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంటే మరో వర్గంతో కలిసి ఇలా దాడి చేస్తారా అని ఈ రాజాసింగ్ ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన తెలిపారు.

Untitled Document
Advertisements