టీడీపీకి ఓట్లు వేస్తే దాడులు చేస్తారా?: తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు

     Written by : smtv Desk | Thu, Jun 20, 2019, 11:00 AM

టీడీపీకి ఓట్లు వేస్తే దాడులు చేస్తారా?: తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు

వైసీపీ ప్రకటించిన నవరత్నాలకు ప్రజలు ఆకర్షితులయ్యారని... అందుకే ఆ పార్టీని గెలిపించారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాశ్ అన్నారు. ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని సద్వనియోగం చేసుకోవడం మానేసి... టీడీపీకి ఓట్లు వేసిన వారిపై దాడులకు పాల్పడటం దారుణమని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంటి టీడీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. తాము కూడా వైసీపీ వారి మాదిరే ప్రవర్తిస్తే... రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పారు. దాడులు చేయడం మానేసి... రాష్ట్ర అభివృద్ధిపై వైసీపీ దృష్టి సారించాలని సూచించారు.

Untitled Document
Advertisements