మైనర్‌ బాలికలపై అత్యాచారం.... నిందితుడికి తగిన శాస్తి!!

     Written by : smtv Desk | Thu, Jun 20, 2019, 11:38 AM

మైనర్‌ బాలికలపై అత్యాచారం.... నిందితుడికి తగిన శాస్తి!!

మైనర్‌ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిపై కొందరు దాడి చేశారు. చీకటి సమయంలో ఇంటికెళ్తున్న వారిపై హటాత్తుగా దాడి చేసిన వారు. ఆ నిందితుల్లో ఒకరి వృషణాలను కోసిపారేశారు. వాటిని చూపించి మిగతా ఇద్దరినీ బెదిరించడంతో వారిరువురూ అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రమైన రక్తస్రావంతో తల్లడిల్లుతున్న ఆ అత్యాచార నిందుతుడిని దారుణంగా కొట్టి చంపేశారా దుండగులు.

వారు శిక్షించింది నిందితులనే అయినా సరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమని, అందువల్ల ఈ హత్య చేసిన వారికోసం గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటివరకూ పోలీసులకు ఎవరూ దొరకలేదు. గతంలో తన ఇద్దరు మిత్రులతో కలిసి ఓ 15 ఏళ్ల బాలికను, అలాగే మరో 18 ఏళ్ల అమ్మాయిని మృతుడి బలాత్కరించాడు. శనివారం జరిగిన అతని హత్యకు, అత్యాచారం కేసుకు ఉన్న సంబంధంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Untitled Document
Advertisements