బురఖా వేసుకోకుండా డ్యాన్స్ చేసిందని....

     Written by : smtv Desk | Thu, Jun 20, 2019, 11:40 AM

బురఖా వేసుకోకుండా డ్యాన్స్ చేసిందని....

బురఖా వేసుకోకుండా పబ్లిక్‌లో డ్యాన్స్ చేసిందని ఓ మహిళను అత్యంత కిరాతకంగా కొట్టాడో వ్యక్తి. నడిరోడ్డుపై పడేసి జుట్టుపట్టుకొని లాక్కెళ్లాడు. ఈ తతంగాన్నంతా చూస్తున్న ప్రజలు ఆమెను మరింత హింసించమంటూ నినాదాలు చేశారు. ఈ అమానవీయ ఘటన ఇరాన్ దేశంలోని రాష్త్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలా మంది నెటిజన్లు మహిళను హింసించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుస్తుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని 1979లోనే ఇరాన్ నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకంగా చట్టాలు కూడా చేయడం విశేషం.





Untitled Document
Advertisements