'రాజుగారి గది 3' లాంచ్ - ప్రధాన పాత్రలో తమన్నా

     Written by : smtv Desk | Thu, Jun 20, 2019, 11:47 AM

 'రాజుగారి గది 3' లాంచ్ - ప్రధాన పాత్రలో తమన్నా

ఓంకార్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ గా గతంలో వచ్చిన 'రాజుగారి గది' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత వచ్చిన 'రాజుగారి గది 2' ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. దాంతో ఈ సారి తమన్నాను ప్రధాన పాత్రధారిగా తీసుకుని 'రాజుగారి గది 3' చేయడానికి రంగంలోకి దిగారు.

కొంతసేపటి క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. దిల్ రాజు క్లాప్ ఇవ్వడంతో ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. విభిన్నమైన కథాకథనాలతో .. అనూహ్యమైన మలుపులతో ఈ కథ సాగుతుందని ఓంకార్ అన్నాడు. తమన్నా జోడీగా అశ్విన్ బాబు కనిపించనున్నాడు.ఇటీవల హారర్ థ్రిల్లర్ చిత్రాలను ఎక్కువగా చేసుకుంటూ వస్తోన్న తమన్నా, ఆ జాబితాలోకి ఈ సినిమాను కూడా చేర్చేసింది.

Untitled Document
Advertisements