'డియర్ కామ్రేడ్' నుంచి మెలోడియస్ సాంగ్ - వీడియో

     Written by : smtv Desk | Thu, Jun 20, 2019, 11:52 AM

'డియర్ కామ్రేడ్' నుంచి మెలోడియస్ సాంగ్ - వీడియో

విజయ్ దేవరకొండ అభిమానులంతా ఇప్పుడు 'డియర్ కామ్రేడ్' సినిమా కోసమే వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన నటించింది. ఆల్రెడీ 'గీత గోవిందం'తో భలే జోడీ అనిపించుకున్న జంట కావడంతో, ఈ సినిమాపై సహజంగానే అంచనాలు పెరిగాయి.

తాజాగా ఈ సినిమా నుంచి మూడో లిరికల్ వీడియో సాంగును విడుదల చేశారు. "గిర గిర గిర తిరగలిలాగా .. తిరిగి అరిగిపోయినా దినుసే నలగాలేదుగా .., అలుపెరుగక తన వెనకాలే అలసి సొలసి పోయినా మనసే కరుగ లేదులే" అంటూ ఈ పాట సాగుతోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం .. రెహ్మాన్ సాహిత్యం .. గౌతమ్ భరద్వాజ్ - యామినీ ఘంటసాల ఆలాపన మనసుకు పట్టేలా వున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి మెలోడియస్ సాంగ్స్ లో ఇదొకటని చెప్పొచ్చు. వచ్చేనెల 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Untitled Document
Advertisements