24న ఇండియామార్ట్ ఐపిఒ

     Written by : smtv Desk | Thu, Jun 20, 2019, 12:38 PM

న్యూఢిల్లీ: ఈ నెల 24 నుంచి ఇండియామార్ట్ ఇంటర్ ఎంఇఎస్‌హెచ్ లిమిటెడ్ సంస్థ ఐపిఒ(ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్) షురూ కానుంది. ఈ కంపెనీ షేర్ల ధర రూ.970 నుంచి రూ.973 మధ్య ఉంటుందని సంస్థ పేర్కొంది. ఈ ఐపిఒ ముగింపు తేదీ ఈనెల 26, అయితే ఈ ఐపిఒ ద్వారా 48.88 లక్షల షేర్లను విక్రయించే అవకాశం ఉంది. వాటాల విక్రయం ద్వారా రూ.475.5 కోట్లను సమీకరించనున్నట్టు సంస్థ పేర్కొంది. ఈ ఐపిఒలో కంపెనీ భాగస్వాములైన ఇంటెల్ క్యాపిటల్, ఎసిపి, క్యూనా క్యాపిటల్‌కు సంబంధించిన వాటాలను కూడా విక్రయించనున్నారు.

అత్యధికంగా ఇంటెల్ క్యాపిట ల్‌కు చెందిన రూ.252 కోట్ల విలువైన వాటాలను విక్రయిస్తారు. మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టాక వస్తున్న తొలి ఐపిఒ ఇదే. ఐసిఐసిఐ సెక్యూరిటీస్, ఎడల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీస్, జెఫ్రీస్ ఆరే మేనేజింగ్ సంస్థలు ఈ ఐపిఒను నిర్వహిస్తాయి. ఇష్యూ తేదీ ప్రారంభించడానికి ముందు రోజు జూన్ 21న యాంకర్ ఇన్వెస్టర్లు బిడ్‌ను వేయాలి. ప్రమోటర్ దినేష్ చంద్ర అగర్వాల్, బ్రిజేష్ కుమార్ అగర్వాల్‌లు ఇష్యూ ద్వారా 14.30 లక్షల కోట్ల షేర్లను విక్రయించ నున్నారు.





Untitled Document
Advertisements