అమెరికా చెప్పేది నిజమా? లేక ఇరాన్ చెప్పేది నమ్మలా?

     Written by : smtv Desk | Thu, Jun 20, 2019, 12:39 PM

అమెరికా చెప్పేది నిజమా? లేక ఇరాన్ చెప్పేది నమ్మలా?

అగ్రరాజ్యం అమెరికా-ఇరాన్ ల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన డ్రోన్ ను కూల్చి వేశామని ఇరాన్ ప్రకటించింది. అమెరికాకు చెందిన ఆర్. క్యూ - 4 గ్రోబల్ హాక్ నిఘా డ్రోన్ ఈ ఉదయం తమ గగనతలంలోకి ప్రవేశించిందని... హోర్మోజ్ గాన్ ప్రావిన్స్ లో ఎగిరిందని ఇరాన్ అధికారిక టీవీ ప్రకటించింది. తమ రివల్యూషనరీ గార్డ్స్ సిబ్బంది ఆ డ్రోన్ ను కూల్చి వేశారని వెల్లడించింది.

అయితే, దీనికి సంబంధించిన ఫొటోలను కానీ, వీడియోలను కానీ విడుదల చేయలేదు. మరోవైపు, ఈ వార్తలను అమెరికా ఖండించింది. ఇరాన్ చెబుతున్నట్టుగా తమ డ్రోన్లు కానీ, విమానాలు కానీ ఆ దేశంలోకి ప్రవేశించలేదని తెలిపింది.

గతంలో కూడా అమెరికాకు చెందిన ఓ డ్రోన్ ను ఇరాన్ కూల్చివేసింది. అంతేకాదు, దాని శకలాలను ప్రదర్శించి అమెరికాకు ఆగ్రహం తెప్పించింది. ఇరాన్ చమురును ఇతర దేశాలు కొనుగోలు చేయకుండా అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.

Untitled Document
Advertisements