ప్రధాని మోదీపై అభిమానం కారణంగా ముస్లీం మహిళ వైవాహిక జీవితంలో దుమారం

     Written by : smtv Desk | Sun, Sep 10, 2017, 12:41 PM

ప్రధాని మోదీపై అభిమానం కారణంగా ముస్లీం మహిళ వైవాహిక జీవితంలో దుమారం

లక్నో, సెప్టెంబర్ 10: దేశ ప్రజల మనస్సుల్లో తనదైన ముద్ర వేసుకున్న ప్రధాని మోదీని అభిమానించడమే ఆ మహిళ వివాహ జీవితానికి శాపంలా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని బసరిక్ పూర్ గ్రామానికి చెందిన ముస్లిం యువకుడికి, బలియా ప్రాంతానికి చెందిన 24 సంవత్సరాల మహిళతో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఇంత వరకు సజావుగా సాగిన వారి వైవాహిక జీవితంలో యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ వచ్చాక మనస్పర్థలు మొదలయ్యాయి. వివరాల్లోకి వెళితే... ఆమెకు సీఎం యోగీ, ప్రధాని మోదీలపై ఉన్న అభిమానంతో వారి చిత్రపటాలను గీసి కుటుంబ సభ్యులకు చూపించింది. దీంతో కోపోద్రిక్తులైన కుటుంబీకులు ఆమె పై దాడికి దిగి, ఇంటి నుండి పంపించి వేశారు. కొంతకాలంగా తల్లిదండ్రుల దగ్గర ఉంటున్న ఆమెకు తన భర్త మరో వివాహానికి సిద్ధమయ్యాడని తెలిసి అత్తవారింటికి వెళ్లగా మరోసారి ఆ బాధితురాలిపై భర్త తీవ్ర దాడి కి దిగాడు. ఈ దురదృష్టకరమైన స్థితిలో ఏం చేయాలో తోచని ఆమె పోలీసులను ఆశ్రయించింది. కాగా, పోలీసులు ఆ మహిళ భర్తకు కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు.

Untitled Document
Advertisements