ఇన్‌ఫినిక్స్ హాట్ 7 స్మార్ట్‌ఫోన్ లాంచ్

     Written by : smtv Desk | Thu, Jul 11, 2019, 04:49 PM

ఇన్‌ఫినిక్స్ హాట్ 7 స్మార్ట్‌ఫోన్ లాంచ్

ఇన్‌ఫినిక్స్ కంపనీ తాజాగా ఇన్‌ఫినిక్స్ హాట్ 7 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. కంపెనీ ఇన్ఫినిక్స్ హాట్ 7 ప్రో ఫోన్‌ను లాంచ్ చేసిన నెల రోజుల తర్వాత ఇన్‌ఫినిక్స్ హాట్ 7 ఫోన్‌ను ఆవిష్కరించింది. అయితే రెండు ఫోన్లలోనూ ప్రత్యేకతలు భిన్నంగా ఉన్నాయి. ఇన్‌ఫినిక్స్ హాట్ 7 స్మార్ట్‌ఫోన్ ధర రూ.7,999. జూలై 15 నుంచి ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. ఇది కేవలం 64 జీబీ మెమరీ, 4 జీబీ ర్యామ్ వేరియంట్ రూపంలో మాత్రమే లభ్యమౌతుంది. కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ముందు, వెనుక భాగాల్లో డ్యూయెల్ కెమెరా వ్యవస్థ ఉంటుంది. కంపెనీ ముందు భాగంలో 13 ఎంపీ+ 2 ఎంపీ డ్యూయెల్ కెమెరాను అమర్చింది. వెనుక భాగంలోనూ ఇదే కెమెరా వ్యవస్థ ఉంటుంది. ఫోన్‌లో అలాగే 6.19 అంగుళాల స్క్రీన్, మీడియాటెక్ హీలియో పీ25 ఆక్టాకోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్, ఫింగర్‌ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి.





Untitled Document
Advertisements