విమానాశ్రయంలో కొండచిలువ

     Written by : smtv Desk | Thu, Jul 11, 2019, 04:52 PM

ఛండీగఢ్: హర్యానాలోని హిషార్ విమానాశ్రయంలోకి పెద్ద కొండచిలువ ప్రవేశించింది. కొండ చిలువ గురువారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో విమానాశ్రయం క్యాంపస్‌లోకి ప్రవేశించగానే అక్కడి ఉన్న భద్రతా సిబ్బంది గుర్తించారు. కొండచిలువ పొడవు చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానిక అటవీ శాఖ అధికారుల సమాచారమిచ్చారు. అటవీ శాఖ అధికారి రామేశ్వర్ దాస్ బృందం అక్కడి చేరుకొని 45 నిమిషాలు పాటు శ్రమించి కొండచిలువను పట్టుకున్నారు. కొండ చిలువను చూడగానే అటవీ శాఖ అధికారులు గుండె ఆగినట్టుగా అనిపించదన్నారు. ఇలాంటి కొండ చిలువలు భారతదేశపు అడవుల్లో ఉంటాయని, విషపూరితం కాదని, చిన్నపాటి జంతువులను ఇవి వెంటనే మింగేస్తాయని వివరించారు. ఆ కొండ చిలువను తిలియార్ జూపార్క్‌కు తరలించారు.

Untitled Document
Advertisements