అదరకొడుతున్న 'ఎవరు' ఫస్టులుక్

     Written by : smtv Desk | Thu, Jul 11, 2019, 05:11 PM

అడివి శేష్ కథానాయకుడిగా వెంకట్ రాంజీ దర్శకత్వంలో 'ఎవరు' నిర్మితమైంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి రీసెంట్ గా ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. తాజాగా ఫస్టులుక్ ను వదిలారు. పగిలిపోయిన అద్దం ముక్కలో రెజీనా తన ఫేస్ చూసుకుంటూ ఉండగా, ఆమెకి ఎదురుగా అడివి శేష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఈ లుక్ ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

సస్పెన్స్ తో కొనసాగే కథలతో ఆశ్చర్యచకితులను చేయడం .. ఆకట్టుకోవడం అడివి శేష్ కి అలవాటే. అదే తరహాలో ఇప్పుడు ఆయన 'ఎవరు' సినిమా చేశాడు. నవీన్ చంద్ర కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా ఆగస్టు 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.

Untitled Document
Advertisements