SENSEX TODAY: నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేకులు

     Written by : smtv Desk | Thu, Jul 11, 2019, 05:51 PM

SENSEX TODAY: నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేకులు

స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగించుకున్నాయి. ఉదయం బిఎస్‌ఈ సెన్సెక్స్‌ 211 పాయింట్లు పెరిగి 38,768 వద్ద ట్రేడ్‌ అవుతుంది. నిఫ్టీ 59 పాయింట్లు లాభపడి 11,558 వద్ద కొనసాగింది. ఇక చివరకు సెన్సెక్స్ 266 పాయింట్ల లాభంతో 38,823 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 11,583 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు ర్యాలీ చేశాయి. అలాగే మెటల్, ఆటో షేర్లు జోరు చూపించాయి. నిఫ్టీ 50లో జీ ఎంటర్‌టైన్‌మెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హీరో మోటొకార్ప్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్ దాదాపు 8 శాతం పెరిగింది. నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ లాభాలతో ముగిశాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఆటో ఇండెక్స్‌లు బాగా ర్యాలీ చేశాయి. అన్ని ఒక శాతానికి పైగా పెరిగాయి. నిఫ్టీ మీడియా ఇండెక్స్ 3 శాతానికి పైగా ఎగసింది.





Untitled Document
Advertisements