విచారణకు రాలేను : నటుడు శివాజీ

     Written by : smtv Desk | Thu, Jul 11, 2019, 06:11 PM

టాలీవుడ్ నటుడు శివాజీ పేరు అలంద మీడియా వ్యవహారంలో ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. టీవీ9 చానల్ వాటాలకు సంబంధించిన వివాదంలో ఆయనపైనా కేసు నమోదైంది. విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఇటీవలే ఆయన అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించగా, శంషాబాద్ లో అధికారులు అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా పోలీసులు విచారణకు రావాలంటూ శివాజీకి నోటీసులు అందించారు. అయితే, తాను అలంద మీడియా వ్యవహారంలో విచారణకు రాలేనంటూ శివాజీ తెలిపారు, తన కొడుకును అమెరికా పంపాల్సి ఉందని, దానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నానని వెల్లడించారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులకు ఈమెయిల్ ద్వారా తెలిపారు.

Untitled Document
Advertisements