డెలివరీకి ముందే పెళ్లి చేసుకుంటా

     Written by : smtv Desk | Thu, Jul 11, 2019, 06:36 PM

అమీ జాక్సన్ గురించి అందరికి తెలుసు. టాలీవుడ్ లో ఎవడు మూవీతో ఇంట్రడ్యూస్ అయ్యింది ఈ బ్రిటిష్ భామ. ఆ సినిమా హిట్ కావడంతో శంకర్ కంట్లో పడింది. శంకర్ ఐ సినిమాలో ఆమెను తీసుకున్నారు. అందులో ఈ హీరోయిన్ సూపర్బ్ గా యాక్ట్ చేసింది. గ్లామర్ రోల్స్ కు ఎలాంటి అడ్డంకి చెప్పలేదు.

సహజ సిద్ధంగా నటించింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ వెంటనే ఈ అమ్మడిని శంకర్ తన రోబో 2పాయింట్ 0 కోసం తీసుకున్నారు. ఇందులో హ్యుమానాయిడ్ గా నటించింది మెప్పించింది. ఈ సినిమా ఈ సినిమా తరువాత ఈ అమ్మడిని రాజమౌళి ఆర్ఆర్ఆర్ లో తీసుకోవాలని అనుకున్నాడు.

ఇదే సమయంలో ఆమె బ్రిటన్ వెళ్లడం.. అక్కడ తన బాయ్ ఫ్రెండ్ జార్జ్ తో ప్రేమలో పడటం.. గర్భవతి కావడం జరిగింది. రీసెంట్ గా వీళ్లిద్దరికీ ఎంగేజ్మెంట్ అయ్యింది. త్వరలోనే ఒక్కటి కాబోతున్నారు. మరో మూడు నెలల్లో అమీ జాక్సన్ డెలివరీ కాబోతున్నది. దీనికంటే ముందుగానే ఈ ఇద్దరు వివాహం చేసుకోబోతున్నారట.

Untitled Document
Advertisements