మహేష్ ని చూసి ఎగిరి గంతేసిన రష్మిక

     Written by : smtv Desk | Thu, Jul 11, 2019, 06:40 PM

మహేష్ బాబు 26 వ సినిమా సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ కాశ్మీర్ లో ప్రారంభం అయ్యింది. ఈ షూటింగ్ కోసం యూనిట్ అంతా అక్కడే ఉన్నది. మహేష్ కూడా రీసెంట్ గా అక్కడ ల్యాండ్ అయ్యాడు. ఆర్మీ డ్రెస్ లో మహేష్ ఎలా ఉన్నాడో ఇప్పటికే లీకైన ఫోటో ద్వారా చూసేశాం.


ఈ షూటింగ్ కోసం హీరోయిన్ రష్మిక కూడా కాశ్మీర్ వెళ్ళింది. ఓపెనింగ్ సమయంలో మహేష్ రాలేదు కాబట్టి.. సెట్స్ లో ఎలా ఉంటాడు అనే విషయం పాపం రష్మికకు తెలియదు. మాములుగా ఆమె సెట్స్ లో ఉండగా మహేష్ వచ్చారట. వచ్చి రాగానే సెట్స్ లో ఉన్న లైట్ బాయ్ నుంచి ప్రతి ఒక్కరిని సరదాగా పలకరిస్తూ.. ఉత్సాహ పరిచారట. అది చూసి పాపం రష్మిక షాక్ అయ్యింది. అంత పెద్ద స్టార్ అయ్యిండి కుడి అలా క్యాజువల్ గా అందరిని పలకరిస్తుంది సరికి సంతోషంతో ఎగిరి గంతేసినంత పని చేసింది రష్మిక

Untitled Document
Advertisements