కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి

     Written by : smtv Desk | Thu, Jul 11, 2019, 06:42 PM

ఒకపక్క కర్ణాటకలో పార్టీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి. గోవాలో కూడా దెబ్బే తగిలింది. గోవా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం సాయంత్రం స్పీకర్‌ను కలిసి.. తమ రాజీనామా లేఖలు సమర్పించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన సమయంలో సీఎం ప్రమోద్ సావంత్, డిప్యూటీ స్పీకర్ మైకెల్ లోబోలు అక్కడే ఉన్నారు. అనంతరం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో 10 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కషాయం కండువాలు కప్పుకున్నారు. వారిలో ఫెర్నాండెజ్, అటనాసియో, జెనిఫర్, క్లియోఫాసియో, ఫ్రాన్సిస్ సిల్వెయిరా, ఫిలిప్ రొడ్రిగ్, విల్‌ఫ్రెడ్, నికాంత్ హలాంకర్ అనే 10 మంది ఎమ్మెల్యేలు వున్నారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 5కి పడిపోయింది. బీజేపీలో చేరిన ఆ ఎమ్మెల్యేలు శుక్రవారం తమ శాసన సభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలంటూ స్పీకర్, గవర్నర్‌లను కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ను బీజేపీ భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకున్నట్టుగానే వ్యవహరిస్తోందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం 17 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ గోవాలో అతిపెద్ద పార్టీగా ఉంది.





Untitled Document
Advertisements