అసెంబ్లీ సమావేశాల్లో పోకిరి డైలాగ్ పేల్చిన మంత్రి అనిల్ కుమార్

     Written by : smtv Desk | Thu, Jul 11, 2019, 06:44 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తొలి రోజే వాడివేడిగా సాగాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి, విపక్ష నేత చంద్రబాబుల మధ్య వాగ్వాదాం జరిగింది. సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. మధ్యలో జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కూడా కురిపించారు. ఆయన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత, సత్సంబంధాల కోసం చర్యలు తీసుకుంటున్నారని, అలాంటి వ్యక్తిని చంద్రబాబు విమర్శించడం సరికాదని అన్నారు.

‘రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉండాలి. అప్పుడే అవి అభివృద్ధి చెందుతాయి. కేసీఆర్ ముందుకొచ్చి గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నాయి. అలాంటి వ్యక్తినే విమర్శించే ప్రతిపక్షం బహుశా ప్రపంచం చరిత్రలోనే ఉండదని నిస్సందేహంగా చెబుతున్నాను. తెలంగాణ నుంచి గోదావరి నీళ్లను తీసుకుంటున్నాం. తమ రాష్ట్రం నుంచి నీళ్లు తీసుకోడానికి కేసీఆర్ అంగీకరించారు…’ అని చెప్పారు.

రైతులకు వడ్డీ లేని రుణాల వ్యవహారంపైనా బాబు, జగన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. 2014-19 మధ్య సున్నా వడ్డీకి ఎంత రుణం ఇచ్చారని జగన్ ప్రశ్నించారు. బాబు హయాంలో వడ్డీ లేని రుణాల కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆరోపించారు. దీనికి బాబు స్పందిస్తూ.. రికార్డులో ఉన్న విషయాన్ని తాను చెప్పనని అన్నారు. మంత్రి అనిల్ కుమార్ కలగజేసుకుని.. బాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారని అయితే, ఒక సవాలు కూడా స్వీకరించరని ఎద్దేవా చేశారు. ‘ 40ఇయర్స్ ఇండస్ట్రీ అసవరం లేదు.. బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం. మీకు బుల్లెట్ దిగింది కాబట్టే సబ్జెక్ట్ నుంచి వాళ్లు పక్కకు పోతున్నారు.. ’ అని అన్నారు.





Untitled Document
Advertisements