కిడ్నీ గుండెలో ఉంటుందంట!

     Written by : smtv Desk | Thu, Jul 11, 2019, 06:45 PM

కిడ్నీ గుండెలో ఉంటుందంట!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు, ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కిడ్నీ గుండెలో వుండటం ఏమిటని నెటిజన్లు ట్రంప్‌ను ట్రోల్ చేస్తున్నారు. అసలు శరీరంలో ఎక్కడా మ్యాచ్ కానీ ఓ అంశాన్ని చెప్పారని నెటిజన్లు ట్రంప్‌ను ఏకిపారేస్తున్నారు. వైద్యానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో ట్రంప్ పలు ఆరోగ్య విషయాలను వెల్లడించారు.మనకోసం మన శరీరంలో ఎక్కువ పనిచేసేది కిడ్నీ అని ట్రంప్ ఈ సందర్భంగా అన్నారు. అందుకే గుండెలో దానికి ఎప్పుడూ స్థానముందని వ్యాఖ్యలు చేశారు. అయితే కొందరు మాత్రం.. కిడ్నీ ప్రాధాన్యతను ట్రంప్ గుండెకు దగ్గరగా పోల్చుతూ వ్యాఖ్యానించాలనుకుని వుంటారని వివరణ ఇస్తున్నారు. అయితే ట్రంప్ చేసిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన నెటిజన్లు చంద్రుడు కుజగ్రహంలోని ఒక భాగంలో వున్నాడు.. కిడ్నీ గుండెలో వుందంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.





Untitled Document
Advertisements