కోహ్లీని ట్రోల్ చేసిన మైఖెల్ వాఘన్

     Written by : smtv Desk | Thu, Jul 11, 2019, 06:49 PM

కోహ్లీని ట్రోల్ చేసిన  మైఖెల్ వాఘన్

ప్రపంచకప్ టోర్నమెంట్‌లో సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఇండియా దారుణంగా పరాజయం పాలు కావడంతో కొందరు మాజీ క్రికెటర్లు పండగ చేసుకుంటున్నారు. ఫైనల్‌లో ఇక తమకు తిరుగు ఉండదని ఆశిస్తున్నారు. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటున్నారు. తాజాగా- ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కేప్టెన్ మైఖెల్ వాఘన్ ఈ వ్యవహారంలో ఇంకో అడుగు ముందుకేశారు. ఇప్పటికే టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్‌తో ట్వీట్ల యుద్ధం చేస్తోన్నారు వాఘన్‌. ఈ సారి ఏకంగా టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీని కెలికారు. ఓ చక్రవర్తి చిత్రపటాన్ని మార్ఫింగ్ చేశారు. ఆ చిత్రపటానికి విరాట్ కోహ్లీ తలను అతికించారు. ఓ చేతిలో బాల్‌, మరో చేతిలో బోర్డింగ్ పాస్ పెట్టారు. టికెట్ ప్లీజ్ అనే కామెంట్‌ను దీనికి జత చేశారు. ఈ పిక్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్‌గా మారింది. తమ అభిమాన క్రికెటర్‌తో ఇలా వెటకారాలు ఆడుతుండటాన్ని చూసి ఎవరు గమ్మున ఉండగలరు? అందుకే- మైఖెల్ వాఘన్‌పై యుద్ధానికి దిగారు అభిమానులు. ఎడా పెడా కామెంట్స్ చేస్తూ ఆయనను ఏకిపడేస్తున్నారు.





Untitled Document
Advertisements