కప్ ఇంగ్లాండ్ దేనా!

     Written by : smtv Desk | Thu, Jul 11, 2019, 08:52 PM

కప్ ఇంగ్లాండ్ దేనా!

ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ బర్మింగ్‌హామ్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 223 పరుగులకే కుప్పకూలిపోయింది. క్రిస్‌వోక్స్ (3/20), ఆదిల్ రషీద్ (3/54), జోప్రా ఆర్చర్ (2/32) ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకున్న కంగారూల టీమ్‌ ఏ దశలోనూ మెరుగైన స్కోరు దిశగా నడవలేదు. ఆ జట్టులో మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ (85: 119 బంతుల్లో 6x4) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఇక లక్ష్య చేధనలో ఇంగ్లాండ్ చెలరేగిపోతోంది. 20 ఓవర్ల వద్ద కేవలం రెండు వికెట్ కోల్పోయి 147 పరుగుల వద్ద కొనసాగుతుంది. ఓపెనర్ బరిస్టో 34 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూ కాగా మరో ఓపెనర్ జాసన్ రాయ్ 85 పరుగులు చేసి సెంచరీ దిశగా వెళ్లి ఔటయ్యి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో జో రూట్ 17, ఇయాన్ మోర్గాన్ 0 వద్ద కొనసాగుతున్నారు. ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో గెలవాలని తహతహలాడుతోంది. కాగా ఈ మ్యాచ్ సొంతం చేసుకోవడానికి ఇంగ్లాండ్ కు అనేక దారులు తెరిసే వున్నాయి. దీంతో ఇంగ్లాండ్ ఈ సారి కప్ గెలుస్తుందనే ఆశలు బాగా ఉన్నాయి. ఇప్పటికే భారత్‌ని ఓడించిన న్యూజిలాండ్ జట్టు ఫైనల్‌కి చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు కివీస్‌తో ఆదివారం లార్డ్స్‌ వేదికగా ఫైనల్లో తలపడనుంది.





Untitled Document
Advertisements