కింగ్ షాకింగ్....!!

     Written by : smtv Desk | Fri, Jul 12, 2019, 03:48 PM

కింగ్ షాకింగ్....!!

నాగార్జున , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం 'మ‌న్మ‌థుడు 2'. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ రీసెంట్ గా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. రీసెంట్ గా విడుదలైన టీజర్స్ లలో కాస్త బోల్డ్ సన్నివేశాలు..ఉండడం తో ఫ్యామిలీ ఆడియన్స్ కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటి వరకు నాగ్ ను ఆలా చూడలేదని.. అలా నాగ్ చేయడం కూడా ఇష్టం లేదని ఫ్యామిలీ ఆడియన్స్ అంటుంటే.. సగం వయసున్న హీరోయిన్లతో కిస్సులు ఏంటని మరి కొందరు విమర్శలు చేయడం మొదలు పెట్టారు.

ఈ విషయం నాగ్ వరకు వెళ్లడం తో అడల్ట్ కంటెంట్ ను తొలగించాల్సిందిగా దర్శకుడు రాహుల్ ను నాగ్ కోరినట్లు తెలుస్తుంది. అనవసరమైన వివాదాలలో ఇరుక్కోవడం నాగ్ కు ఇష్టంలేదని.. అది కూడా ఈ అడల్ట్ స్టఫ్ కు దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ముద్దు సీన్లు తొలగించాలసిందిగా కోరారట. నాగ్ చెప్పడం తో డైరెక్టర్ కూడా వాటిని తొలగించేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. మరి ఏ ఏ సన్నివేశాలు తొలగిస్తారో చూడాలి.





Untitled Document
Advertisements