సంక్రాంతికి స్టార్ హీరోల సినిమా వార్

     Written by : smtv Desk | Sat, Jul 13, 2019, 09:43 AM

స్టార్ హీరోల సినిమా వార్ అంటే గుర్తొచ్చేది సంక్రాతి పండుగే. ఈ సీజన్ అంటే ప్రతి హీరోకి ఇష్టమే. ప్రతి సంక్రాంతికి తమ సినిమాను విడుదలచేయాలని ఆశపడుతుంటారు. అందుకే ప్రతి సంక్రాతి పండుగకు పోటీ గట్టిగానే ఉంటుంది. రాబోయే సంక్రాంతికి కూడా పోటీ గట్టిగానే ఉండనుంది. ఎందుకంటే స్టార్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, బాలకృష్ణల సినిమాలు బరిలో ఉండబోతున్నాయి.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ చేస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం సంక్రాంతికే రానుండగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ చేస్తున్న చిత్రం సైతం అదే పండుగకు విడుదలకానుంది. ఇక బాలకృష్ణ కొత్త చిత్రం కూడా అప్పుడే విడుదలయ్యే అవకాశాలున్నాయి. అలాగే మరొక మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సైతమ్ తన 'ప్రతిరోజూ పండగే' చిత్రాన్ని పండుగనాడే తీసుకురావాలని అనుకుంటున్నారు. దీంతో ఈసారి సంక్రాంతి పోటీ భీభత్సమైన రీతిలో ఉండనుందని అర్థమవుతోంది.





Untitled Document
Advertisements