పులితో సరదాగా ఆడుకుంటున్న మాళవిక

     Written by : smtv Desk | Sat, Jul 13, 2019, 03:23 PM

రవితేజతో సినిమాలు చేసిన హీరోయిన్లలో మాళవిక శర్మ రూటే సపరేటు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన నేల టికెట్ సినిమా దారుణంగా ఫెయిల్ అయ్యింది. ఈ సినిమా ఫెయిల్ కావడంతో మాళవికకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.

సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పెట్టి బాగానే డబ్బు సంపాదిస్తోంది. థింక్ డిఫరెంట్ అన్నట్టుగా ఈ హీరోయిన్ చాలా కొత్తగా ఆలోచిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. రీసెంట్ గా ఈ అమ్మడు థాయిలాండ్ లో వెళ్ళింది. అక్కడ పటాయ్ లోని టైగర్ జూకు వెళ్లి ఫోటోలు దిగింది. మాములుగా బోన్ బయట నుంచి ఫోటోలు దిగితే దాంట్లో పెద్దగా ఆశ్చర్యం ఏమి ఉండేది కాదు. న్యూస్ అయ్యేది కాదు.

ఈ అమ్మడు బోన్ లోపలికి వెళ్లి పులితో సరదాగా ఫోటోలు దిగింది. ఎన్టీఆర్ డైలాగు చెప్పినట్టు.. పులిని దూరం నుంచి చూడాలనుకోవడంతో తప్పులేదు. ఫోటో దిగలనుకుంటే కాస్త రిస్క్ ఎక్కువైనా ప్రయత్నించు.. చనువిచ్చింది కదా ఆడుకోవాలని చూస్తే ...సినిమాలోనైతే ఎన్టీఆర్ తుక్కురేగ కొట్టాడు. కానీ, పటాయ్ జూలో అలా జరగలేదు. మాళవిక ఆ పులులతో చక్కగా ఆడుకుంది. ఫోటోలు దిగింది. భయం వేయలేదా అంటే.. అక్కడి పులులు ఏమి అనవట. సరదాగా ఉంటాయని, మనుషులతో కలిసిపోయి ఉంటాయని జూ నిర్వాహకులు చెప్తున్నారు.





Untitled Document
Advertisements