స్టార్ హీరోలు ఇద్దరు కలిస్తే

     Written by : smtv Desk | Sun, Jul 14, 2019, 09:32 AM

ఒకరేమో టాలీవుడ్ ను షేక్ చేస్తున్న యువ హీరో.. మరొకరేమో కన్నడని ఏలేస్తున్న స్టార్ హీరో ఇద్దరు కలిస్తే ఆ హంగమా ఎలా ఉంటుంది. ఇంతకీ ఎవరా స్టార్స్ అంటే కె.జి.ఎఫ్ స్టార్ యశ్ తో మన అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ స్పెషల్ మీటింగ్ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తుంది. విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా ప్రమోషన్స్ లో ఈ స్పెషల్ మీటింగ్ జరిగింది.

ఈ సినిమాను తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అన్నిచోట్ల జూలై 26న రిలీజ్ ఫిక్స్ చేశారు. అందుకే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బెంగళూరులో యశ్ తో ప్రమోట్ చేస్తున్నారు. కన్నడ ట్రైలర్ యశ్ రిలీజ్ చేయగా ఆ తర్వాత యశ్ తో విజయ్ దిగిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యశ్, విజయ్ ఇద్దరు సేం బ్లాక్ టీ షర్ట్ తో.. సేం హెయిర్ స్టైల్ తో కనిపించారు.





Untitled Document
Advertisements