20 కోట్ల క్లబ్ లోకి సమంత సినిమా

     Written by : smtv Desk | Sun, Jul 14, 2019, 11:33 AM

అక్కినేని కోడలు సమంత హీరోయిన్ గా ఆమె లీడ్ రోల్ లో వచ్చిన సినిమా ఓ బేబీ. కొరియన్ మూవీ మిస్ గ్రానీకి రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను నందిని రెడ్డి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా జూలై 5న రిలీజై సక్సెస్ ఫుల్ గా అవుతుంది. ఇప్పటికే 20 కోట్ల క్లబ్ లోకి చేరింది ఓ బేబీ. నందిని రెడ్డి డైరక్షన్, సమంత నటన సినిమాకు ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. సినిమా వారం రోజుల్లో 20 కోట్ల గ్రాస్ 11 కోట్ల షేర్ సాధించింది.

ఏరియా వైజ్ వారం రోజుల కలక్షన్స్ చూస్తే :

నైజాం : 5.6 కోట్లు

సీడెడ్ : 1.4కోట్లు

ఆంధ్రా : 5కోట్లు

ఏపి/తెలంగాణ : 12కోట్లు

అమెరికా : 4.8 కోట్లు

కర్ణాటక : 2.1కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.3కోట్లు

వరల్డ్ వైడ్ : 20.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఓ బేబీ.





Untitled Document
Advertisements