రామ్ ని మూడు సార్లు కొట్టాను

     Written by : smtv Desk | Sun, Jul 14, 2019, 04:14 PM

రామ్, పూరి జగన్నాధ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఇందులో కథానాయికలుగా నాభ నటేష్, నిధి అగర్వాల్ నటించారు. సినిమాలోని ట్రయాంగిల్ లవ్ స్టోరీలో నాభ నటేష్, రామ్ మధ్యన నడిచే ట్రాక్ బాగుంటుందని టాక్. ఈ విషయం గురించి నాభ నటేష్ మాట్లాడుతూ షూటింగ్ సమయంలో రామ్ ను మూడుసార్లు కొట్టాల్సిన సన్నివేశాలు వచ్చాయి.

అప్పుడు కొట్టేందుకు నేను చాలా ఇబ్బందిపడ్డాను. కానీ రామ్ మాత్రం ఏం పర్వాలేదు కొట్టు అని ఎంకరేజ్ చేశారని చెప్పుకొచ్చింది. ఇటీవల విడుదలైన ట్రైలర్లో సైతం నాభా రామ్ ను చెంప దెబ్బలు కొట్టే షాట్స్ రెండున్నాయి. అంటే వారి లవ్ ట్రాక్ మంచి మాస్ తరహాలో ఉంటుందన్నమాట. ఇకపోతే ఈ చిత్రం ఈ నెల 18న విడుదలకానుంది.





Untitled Document
Advertisements